♪♫
TG-4264
Telugu
శ్రేష్టమైన నామం
Shreshtamaina Naamam
0
views
పల్లవి
శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామం జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం సాటిలేని నామం – స్వస్థపరచే నామం అన్ని నామముల కన్నా నిత్యమైన నామం యేసు నామం మధుర నామం యేసు నామం సుమధుర నామం (2) ||శ్రేష్టమైన||
1వ చరణం
త్రోవ చూపి సరియైన దారిలో నన్ను నడిపించే నామం దుష్ట శక్తులు బంధకములు తొలగించే తరములెన్నో మారినా మనుజులంతా మారినా (2) మారని నామం మహిమ నామం మరణము గెల్చిన శ్రీ యేసు నామం (2) ||శ్రేష్టమైన||
2వ చరణం
జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం కలవరము నను వెంటాడినను ధైర్యమునిచ్చె ప్రభు నామం భారమెంతో ఉన్నను శాంతినొసగే దివ్య నామం (2) మారని నామం మహిమ నామం మరణము గెల్చిన శ్రీ యేసు నామం (2) ||శ్రేష్టమైన||