♪♫
TG-288
Telugu
శుభవార్త వింటిమి యేసు రక్షించును
shubhavaartha vintimi yeesu rakssinchunu
208
views
పల్లవి
శుభవార్త వింటిమి యేసు రక్షించును ఎల్లవారు విననీ యేసు రక్షించును ప్రభు మాట వింటిరా పర్వతంబుల్ దాటుచు వార్త ప్రకటింపుడి యేసు రక్షించును.
1వ చరణం
స్వరమెత్తి పాడుడీ యేసు రక్షించును దైవభ్రష్టు లెల్లరిన్ యేసు రక్షించును ద్వీపవాసు లందఱు వినునట్లు చాటుఁడి దివ్యవర్తమానము యేసు రక్షించును ||శుభవార్త వింటిమి||
2వ చరణం
ఇహ బాధనుండియు యేసు రక్షించును పరభాగ్యమిచ్చును యేసు రక్షించును దీనుజను లెల్లరు భూనివాసులందఱు ఈ సువార్త వినుఁడీ యేసు రక్షించును. ||శుభవార్త వింటిమి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.