శుభవేళలో నీ మోమును చూసి - అర్పించెదను నన్నూ
shubhaveellaloo nee moomunu chuusi - arpinchedanu nannuu
🎵 TG-1227🌐 Telugu
పల్లవి
శుభవేళలో నీ మోమును చూసి - అర్పించెదను నన్నూ ఆరాధన స్తుతి స్తోత్రములు - తండ్రీ నీకేనయ్యా ||శుభవేళలో|| ఆరాధన - ఆరాధన - ఆరాధన - ఆరాధన నా ప్రియ యేసునకే - పావనాత్మ ప్రభునకే
1వ చరణం
ప్రతిరోజును ప్రతి నిమిషము - నీ తలంపులతో నింపబడాలి (2) నా నోటి మాటలెల్ల - పరుల గాయములు, మా న్పాలి ||శుభవేళలో||
2వ చరణం
నీ హృదయ ఆశలన్నియూ - హృదినాడిగా మారాలి (2) జీవించు రోజులెల్లా - నీసాక్షిగా మారాలి ||శుభవేళలో||
3వ చరణం
శుభవార్త భారం ఒక్కటే - నా హృదయ భారమై ఉండాలి (2) నా దేశం అంచులెల్లా - నీ నామం ప్రకటించాలి||శుభవేళలో||