TG-4268
Telugu

శుద్ధుడవయ్యా

Shuddhudavayyaa

0
views
పల్లవి

శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా పాపము బాప వచ్చితివయ్యా శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా రక్షణ భాగ్యం తెచ్చితివయ్యా సిద్ధపడే శుద్ధ దేహం సిలువనెక్కె సందేశం ఆసనమో తండ్రి చిత్తం ఆరంభమో కల్వరి పయనం ||శుద్ధు||

1వ చరణం

చెమట రక్తముగా మారెనే ఎంతో వేదనను అనుభవించే ప్రార్ధించెను గిన్నె తొలగించుమని యేసు జ్ఞాపకమాయెనే తండ్రి చిత్తం (2) ||సిద్ధపడే||

2వ చరణం

చిందించె రక్తము నా కొరకే ప్రవహించే రక్తము పాపులకై రక్తపు బొట్టు ఒకటి లేకపోయే ప్రక్కలో బల్లెపు పోటు గ్రక్కున దిగెనే (2) ||సిద్ధపడే||