TG-5746
Telugu

సిద్ధపరచిన గొప్ప రక్షణ నేడు చూడరండి

Siddhaparachina Goppa Rakshana Needu Choodarandi

23
views
పల్లవి

సిద్ధపరచిన గొప్ప రక్షణ నేడు చూడరండి ధాత్రి వెలసిన యేసుపేరున పాటపాడరండి (2) ఆరాధించుడి ఆనందించుడి ఆరాధించుడి ఆనందించుడి సర్వలోక జనమా (2) ||సిద్ధ||

1వ చరణం

తల్లవుతావనే వార్త చేరేనే మరియమ్మకు కన్య మరియమ్మకు (2) కృంగిపోకనే సిద్దామాయేనే యేసయ్యకు జన్మనిచ్చేందుకు (2) ప్రభువు దాసురాలనని విధేయత చూపింది పరిశుద్ధాత్మ ద్వారానే ఇది సాధ్యం అయ్యింది ||ఆరాధి||

2వ చరణం

దూత వచ్చెనే నిజము చెప్పెనే యోసేపుకు భక్త యోసేపుకు (2) మనసు మారెనే బయలుదేరెనే చూసేందుకు చేర్చుకునేందుకు (2) దైవచిత్తాన్ని ఎరిగే ప్రవర్తన నేర్పింది వినయమనసు ద్వారానే ఇది సాధ్యం అయ్యింది ||ఆరాధి||

3వ చరణం

తార సాగెనే దారి చూపెనే జ్ఞానులకు తూర్పు జ్ఞానులకు (2) ప్రకాశించేనే ఇల్లు చేర్చేనే మొక్కేందుకు పూజ చేసేందుకు (2) క్రీస్తు దర్శనం కలిగే సహాయము చేసింది దైవబోధ ద్వారానే ఇది సాధ్యం అయ్యింది ||ఆరాధి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.