TG-4271
Telugu

సిలువ చెంత చేరిననాడు

Siluva Chentha Cherinanaadu

0
views
పల్లవి

సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయున్ పౌలువలెను సీలవలెను సిద్ధపడిన భక్తులజూచి కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు పండియున్న పాపులనైన పిలచుచుండే పరము చేర ||సిలువ||

1వ చరణం

వంద గొర్రెల మందలోనుండి ఒకటి తప్పి ఒంటరియాయే తొంబది తొమ్మిది గొర్రెల విడిచి ఒంటరియైన గొర్రెను వెదకెన్ ||సిలువ||

2వ చరణం

తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగిరాగా తండ్రియతని జేర్చుకొనియే ||సిలువ||

3వ చరణం

పాపి రావా పాపము విడచి పరిశుద్ధుల విందుల జేర పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి యంతము ||సిలువ||