♪♫
TG-4277
Telugu
సిలువలో సాగింది యాత్
Siluvalo Saagindi Yaathra
0
views
పల్లవి
సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర (2) ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ||సిలువలో||
1వ చరణం
పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో (2) నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2) నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||
2వ చరణం
వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2) గేలి చేసినారు పరిహాసమాడినారు (2) నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||