TG-4274
Telugu

సిలువలో ఆ సిలువలో

siluvaloo aa siluvaloo

Andhra Kraistava Keerthanaluఎం సి ప్రభుదాస్ · M C Prabhudassఎస్ పీ బాలసుబ్రమణ్యం · S P Balasubramanyam
22
views
పల్లవి

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2) వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా ||సిలువలో||

1వ చరణం

నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ- మోయలేక మోసావు (2) కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2) తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2) ||వెలి||

2వ చరణం

వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2) దూషించి అపహసించి హింసించిరా నిన్ను (2) ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా (2) ||వెలి||

3వ చరణం

నాదు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే నాదు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే (2) నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం (2) సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను (2) ||వెలి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.