సిలువను మోసితివా నా కొఱకై కలువరి మెట్టపైకి సిలువ నా యాత్మలోఁ బలుమాఱు దలఁపఁగాఁ దాలిమి లేదాయెను హా యీ జాలికి మారుగా నేనేమి సేయుదు ప్రేమను మరువఁజాల ||సిలువను మోసితివా||
ఘోరమైనట్టి యీ భారమైన సిలువ ధరియించి భుజముపైని నా దురితముల్ బాపను కరుణచేఁ జనుదెంచి మరణము నొందితివా ||సిలువను మోసితివా||
కలువరి మెట్టపైఁ కాలు సేతు లెల్ల చీలలతోఁ గ్రుచ్చిపట్టి యా సిలువకుఁ గొట్టఁగ విలువైన నీ మేని రక్తము ప్రవహించెనా ||సిలువను మోసితివా||
మెట్టపైన నిన్నుఁ పెట్టిన బాధ నేఁ బట్టి తలంపఁగను ఆహా పట్టైన నీ ప్రేమ నెట్టుల మఱతును కష్టముల్ గలిగినను ||సిలువను మోసితివా||
పంచగాయములను నెంచి యాత్మలోన నుంచి తలంపఁగను హానా మించిన దురితముల్ ద్రుంచి నన్నెంచిర క్షింపవచ్చెను భూమికి ||సిలువను మోసితివా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.