సిలువేకదా చింతసదామహా సిలువేకదా మనకమోఘము
siluveekadaa chinthasadaamahaa siluveekadaa manakamooghamu
సిలువేకదా చింతసదామహా సిలువేకదా మనకమోఘము వెలలేని యాత్మ సంభోగము విలసత్పరమ ద్రవ్యభాగ్యము గుణత్యాగము ననురాగము మహా ||సిలువేకదా చింతసదామహా||
సిలువ బోధకు చెవినొగ్గుమా చెలువముగొన నాత్మ నొగ్గుము వల్ల నొప్పు నీకు సౌభాగ్యము ఆత్మారోగ్యము నంతో శ్లాఘ్యము ||సిలువేకదా చింతసదామహా||
చంపెనిందు ప్రభుని కర్తను సంపాదించె నర విముక్తుని బెంపారు నానందముసూక్తిని ననురక్తిని నిత్యముక్తిని మహా ||సిలువేకదా చింతసదామహా||
పాపదావాగ్ని సంతుప్తులు స్వపుణ్యదుర్మద వ్యాప్తులు నీ పేరు నమ్మిన దీప్తులు సుఖ ప్రాప్తులు సర్వ తృప్తులు మహా ||సిలువేకదా చింతసదామహా||
రంగొప్ప దీని ప్రసంగము మంగళగీతసారంగము అంగీకార హృత్పద్మ భృంగము రక్షశృంగము పాపభంగము మహా ||సిలువేకదా చింతసదామహా||
భయములేదని చాటుచున్నది ప్రియయేసు వేడుకొమ్మన్నది దయ జూపు నీ కనుచున్నది నిక్కమైనది చక్కనైనది మహా ||సిలువేకదా చింతసదామహా||
చేరవచ్చిన వారి భారము ఘోరమైనను తద్విచారము ఆరూఢిపరమార్థ సారము సువిచారము సదాచారము మహా ||సిలువేకదా చింతసదామహా||
ఘనమైన రక్షక ధ్యానము మనల ముక్తికి జేర్చువైనము జనకృపాసుధా పానము దూతగానము తేజోమానము మహా ||సిలువేకదా చింతసదామహా||
ఇన్ని దినము లూరకుంటిమి యిపుడే రక్షణ కనుగొంటిమి కన్న తండ్రిని గొల్వకుంటిమి కానకుంటిమి యెరగకుంటిమి మహా ||సిలువేకదా చింతసదామహా||