సిల్వయొద్దఁ జేరుదున్ బీద హీనయంధుఁడన్
silvayoddam jeerudun beeda heenayandhumdan
పల్లవి
సిల్వయొద్దఁ జేరుదున్ బీద హీనయంధుఁడన్ లోకమున్ త్యజింతును పూర్ణముక్తి నొందుదున్ ||సిల్వయొద్దఁ జేరుదున్||
1వ చరణం
నిన్ నేఁజేరఁ గోరఁగా నన్ను ఁబాయు పాపము శుద్ధిఁజేతునంచును యేసు మాటనిచ్చెను. ||సిల్వయొద్దఁ జేరుదున్||
2వ చరణం
నన్ను ను నా మిత్రులన్ లోక యాస్తిఁ గాలమున్ దేహయాత్మయంతయు నీకర్పింతునిప్పుడు. ||సిల్వయొద్దఁ జేరుదున్||
3వ చరణం
యేసుమాట నమ్మెదన్ క్రీస్తు రక్త పుణ్యముఁ జూచి మ్రొక్కి యేసుతో నేను మృతినొందితిన్. ||సిల్వయొద్దఁ జేరుదున్||
4వ చరణం
యేసు తాను వచ్చును నాకు నిచ్చు పూర్ణతన్ శుద్ధ సౌఖ్య మొందుదున్ జయస్తోత్ర మేసుకు. ||సిల్వయొద్దఁ జేరుదున్||