TG-5799
Telugu

స్నేహితుడా నా హితుడా నన్ను విడువని బహు ప్రియుడా

Sneehithudaa Naa Hithudaa Nannu Viduvani Bahu Priyudaa

27
views
పల్లవి

స్నేహితుడా నా హితుడా నన్ను మరువని బహు ప్రియుడా నన్ను విడువని నా హితుడా ఏమని నిన్ను వర్ణింతును నీ ప్రేమకు నేను ఏమిత్తును (2) ||స్నేహితుడా||

1వ చరణం

కారుచున్న కన్నీరు తుడిచి పగిలియున్న గుండెను ఓదార్చి (2) ఆదరించిన స్నేహితుడా నన్నోదార్చిన నా హితుడా (2) నన్ను ఓదార్చిన నా హితుడా ||స్నేహితుడా||

2వ చరణం

మోడుగున్న బ్రతుకును చిగురించి గూడు చెదరిన నన్ను దరి చేర్చి (2) కృపను చూపిన స్నేహితుడా కనికరించిన నా హితుడా (2) నన్ను కరుణించిన నా హితుడా ||స్నేహితుడా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.