TG-4282
Telugu

స్నేహితుడా నా స్నేహితుడా

Snehithudaa Naa Snehithudaa

25
views
పల్లవి

స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా (2) నన్నెంతో ప్రేమించినావు నాకోసం మరణించినావు (2) మరువగలనా నీ స్నేహము మరచి ఇల నే మనగలనా (2) ||స్నేహితుడా||

1వ చరణం

నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నే వేచానే నిరతం నీ తోడుకై (2) ఇచ్చెదన్ నా సర్వస్వము నాకున్న ఆశలు ఈడేర్చుము (2) ||స్నేహితుడా||

2వ చరణం

కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నను పలుకరించావు (2) మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు (2) ||స్నేహితుడా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.