TG-5749
Telugu

సూడ సక్కని బాలుడమ్మో బాలుడు కాడు మన దేవుడమ్మో

Sooda Sakkani Baaludammoo Baaludu Kaadu Mana Deevudammoo

0
views
పల్లవి

సూడ సక్కని బాలుడమ్మో బాలుడు కాడు మన దేవుడమ్మో (2) కన్య మరియ గర్భమున ఆ పరిశుద్ధ స్థలమున (2) మనకై జన్మించినాడు మనలను రక్షించినాడు (2) ||సూడ||

1వ చరణం

బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను (2) ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను (2) సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి పరవశించ సాగెను (2) ||సూడ||

2వ చరణం

మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను (2) పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు (2) దివి నుండి భువిపైకి దిగి వచ్చి మానవులను ప్రేమించెను (2) ||సూడ||