శ్రీ యేసుండు జన్మించె
Sri Yesundu Janminche
శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2) నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2) ||శ్రీ యేసుండు||
ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2) ఇమ్మానుయేలనెడి నామమందున (2) ||శ్రీ యేసుండు||
సత్రమందున పశువులశాల యందున (2) దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2) ||శ్రీ యేసుండు||
పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2) పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2) ||శ్రీ యేసుండు||
గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2) దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2) ||శ్రీ యేసుండు||
మన కొరకొక్క శిశువు పుట్టెను (2) ధరను మన దోషములబోగొట్టెను (2) ||శ్రీ యేసుండు||
పరలోకపు సైన్యంబు గూడెను (2) మింట వర రక్షకుని గూర్చి పాడెను (2) ||శ్రీ యేసుండు||
అక్షయుండగు యేసు పుట్టెను (2) మనకు రక్షణంబు సిద్ధపరచెను (2) ||శ్రీ యేసుండు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.