TG-5795
Telugu

స్థిరమైన ప్రేమ చూపుచూ నన్నాదరించి కాపాడిన యేసు దైవమా

Sthiramaina Preema Choopuchoo Nannaadarinchi Kaapaadina Yeesu Daivamaa

27
views
పల్లవి

స్థిరమైన ప్రేమ చూపుచూ నన్నాదరించి కాపాడిన యేసు దైవమా రాబోతున్న దినములన్నియు ఆనందం అభివృద్ధి ప్రసాదించుమా బాధలందు కృంగిపోకుండగా నోట నిత్యము నీ కీర్తి ఉంచుమా నీకు ప్రథమస్థానమిచ్చు రీతిగా నీ చిత్తమేదో తెలియజేయుమా సమయోచిత వివేకం సరిపోయిన సహాయం కృపాక్షేమములు పంపుమా శోధనందు లొంగిపోకుండగా నాకు హెచ్చుగా నీ శక్తి పంచుమా నీలో నిలిచి ఫలములిచ్చు రీతిగా నీ దీనమనసు కలుగజేయుమా భక్తి యందు తగ్గిపోకుండగా నాలో నిండుగా నీ వాక్కు పంపుమా నీకు తగిన మహిమనిచ్చు రీతిగా నీ మార్గమందు నడువజేయుమా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.