TG-5794
Telugu

స్థితులను మార్చే స్తుతులను నేను మరణము వరకర్పించెదను

Sthithulanu Maarchee Sthuthulanu Neenu Maranamu Varakarpinchedanu

27
views
పల్లవి

స్థితులను మార్చే స్తుతులను నేను మరణము వరకర్పించెదను అపజయమెరుగని జయ జీవితము నిను స్తుతియించి పొందెదను దేవదూతల దైవారాధన భువియందే అర్పించెదనూ ఇరువది నలుగురు పెద్దల వలెనే సాగిలపడి పూజించెదనూ యుగయుగములకు పరిశుద్ధుడవని ఆరాధించుచు బ్రతికెదనూ ఆరేసి రెక్కలు ఉన్న మహాదూతలన్నియు పరిశుద్ధుని పరిశుద్ధముగా ఆరాధన చేసిరి దూతల వలెనూ గొప్ప కంఠస్వరముతో గాన ప్రతిగానముతో స్తుతి ధూపం వేసెదను పది మంది కుష్ఠరోగులు స్వస్థతనొందిరి.. యేసుకు ఒక్కడే వచ్చి కృతజ్ఞత చెల్లించెను సమరయుని ఆరాధనను కృతజ్ఞత భావముతో నాలోన కలిగుండి నా జన్మ ధన్యం చేసెదను ఆకాశ తారను చూస్తు జ్ఞానులువచ్చిరి శిశువైన యేసుని ఎదుట సాగిలపడిరి ఎంత ఎదుగుచున్ననూ నీ కాళ్ళ ఎదుట కలిగి ఉన్నదంతయు ఇచ్చి నీ సేవ చేసెదనూ

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.