స్తోత్ర గీతములను పాడుచు ప్రియ ప్రభుని పూజించుడి
Sthoothra Geethamulanu Paaduchu Priya Prabhuni Poojinchudi
స్తోత్ర గీతములను పాడుచు - ప్రియ ప్రభుని పూజించుడి హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ స్తోత్ర గీతములను పాడుచు - ప్రియ ప్రభుని పూజించుడి 1. రారండి సంతసించుచు - రారాజును కీర్తించను రాజులకు రాజని - ప్రభువులకు ప్రభువని రమ్యమైన రాజును స్తుతించెదం 2. సిలువలో బలియాయెను - విలువైన రక్తము కార్చెను ఎంత శ్రమనొందెను - ఎంత బాధ నోర్చెను తన రక్తముతో మనల కొనెగదా 3. విందు శాలకు తెచ్చెను - ప్రేమ ధ్వజము పైకెత్తెను వింత సుందరుడని - వేలలో శ్రేష్ఠుడని ఎంతైన జేయు సామర్థ్యుడని 4. మన ఆత్మ ప్రాణ - దేహముల్ - సజీవముగ నర్పింతుము అత్తరును పూసిన - మరియ వలె మనమును పరిమళంబులన్ ప్యాపింప జేయుదం 5. ప్రశంసించె ప్రభువు మరియను - మంచి కార్యము చేసెనని ప్రభువు కొరకు చేయుము - ప్రాణము నర్పించుము ప్రభువే సర్వము మనకు 6. మరణమున్ తానే గెల్చెను - సైతానును ఓడించెను మరణమున్ మ్రింగెను - మరణముల్లు విరిచెను జయము జయమటంచు ఆర్భటించెదం 7. ఆర్భాటముగా ప్రభువు - మేఘారూఢుడై వచ్చును నిశ్చయముగా మనలను కొనిపోవు వేగమే మహిమ దేహములను పొంది యుందుము
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.