TG-5775
Telugu

స్తోత్రబలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెన్

Sthoothrabali Arpinchedamu Manchi Yeesu Meelu Cheesen

29
views
పల్లవి

స్తోత్రబలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెన్ (2) చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదన్ (2) తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం (2) ప్రాణమిచ్చి నను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే (2) నీ కొరకు బ్రతుక వేరుపరచి సేవ చేయ కృప ఇచ్చితివే (2) ||తండ్రీ||

1వ చరణం

గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కార్చితివే (2) రక్త కోటలో కాచుకొని శత్రు రాకుండ కాచితివే (2) ||తండ్రీ||

2వ చరణం

చూచే కన్నులు ఇచ్చితివి పాడే పెదవులు ఇచ్చితివి (2) కష్టించే చేతులు ఇచ్చితివి పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి (2) ||తండ్రీ||

3వ చరణం

మంచి ఇల్లును ఇచ్చావయ్యా వసతులన్నియు ఇచ్చావయ్యా (2) కష్టించి పనిచేయ కృప చూపి అప్పు లేకుండ చేసితివే (2) ||తండ్రీ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.