స్తోత్రబలి స్తోత్రబలి మంచి దేవా నీకేనయ్యా
Sthoothrabali Sthoothrabali Manchi Deevaa Neekeenayyaa
స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే (2) నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2) నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2) మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2) ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు (2) యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.