TG-5777
Telugu

స్తోత్రము పాడి పొగడెదను దేవాదిదేవా

Sthoothramu Paadi Pogadedanu Deevaadideevaa

0
views
పల్లవి

స్తోత్రము పాడి పొగడెదను దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను మ్రొక్కి కీర్తించెదను 1.  అద్భుతమైన ప్రేమ - నాలో పరమతండ్రి చూపు శుద్ధ ప్రేమ ఎన్నడును మారని ప్రేమ - నాలో నిలుచుండు ప్రేమ 2.  జ్యోతిగా జగమునకు - వచ్చి జీవమిచ్చి నన్నుకొన్న ప్రేమ త్యాగియైన క్రీస్తు ప్రేమ - దివ్య మధుర ప్రేమ 3.  మాయలోక ప్రేమను - నమ్మి నశించిన నన్ను ప్రేమించెను నన్ను జయించిన దైవ ప్రేమ - నాలో ఉప్పొంగు ప్రేమ 4.  ఆధారమైన ప్రేమ - దినము మాతవలె నన్నాదుకొను ప్రేమ ఉన్నత మహా దైవ ప్రేమ - నన్నాకర్షించె ప్రేమ 5.  మాట తప్పని ప్రేమ - పరమ వాక్కు నిచ్చి ఆదరించె ప్రేమ సర్వ శక్తిగల దైవ ప్రేమ - సతతము నుండు ప్రేమ