TG-5779
Telugu

స్తోత్రము సేయరే సోదరులారా మనాత్మలతో

Sthoothramu Seeyaree Soodarulaaraa Manaathmalathoo

0
views
పల్లవి

స్తోత్రము సేయరే - సోదరులారా మనాత్మలతో తండ్రిన్ ధాత్రిని మన పర-మాత్ముని వాక్కులు స్తోత్రములో గలిపి ||స్తోత్ర||

1వ చరణం

1.  మరల విచటం గూ-డుదమో లేదో-మనమందర మింకను త్వరలో మన పరలోకపు తండ్రి తోడనుందు మేమో ||స్తోత్ర||

2వ చరణం

2.  ఇచ్చట ప్రేమల కిదియే కడవరి - వచ్చియున్నదేమో యచ్చట మనమందరము గలిసికొని - యానందింతుముగా ||స్తోత్ర||

3వ చరణం

3.  ఎక్కువ ప్రేమలు - చక్కని స్తోత్రము- లక్కడ మనమంత మిక్కిలి ప్రియుండగు దేవుని కిడుదు - మొక్క మనసుతోను ||స్తోత్ర||

4వ చరణం

4.  కన్నీరుండదు - చావు కష్టము - లెన్నిటి కండవుగా పన్నుగ మన శృం-గారపు బ్రతుకు - లెన్న కండవుగా ||స్తోత్ర||

5వ చరణం

5.  మ్రోగును వీణెలు - సాగును పాటులు- సతతముగా నచట రాగము లెంతో రమ్మమైన యుండన్ - బాగింతనలేము ||స్తోత్ర||

6వ చరణం

6.  గొఱ్ఱెపిల్ల రక్తము - విలువచ్చట - గొప్పది అందుముగా గరుతరమగు మన దేవుని ప్రేమను - కూర్మితో జూతుముగా ||స్తోత్ర||