స్తోత్రము స్తోత్యమయ్యా దేవా స్తోత్రము స్తోత్యమయ్యా
Sthoothramu Sthoothyamayyaa Deevaa Sthoothramu Sthoothyamayyaa
స్తోత్రము స్తోత్యమయ్యా దేవా - స్తోత్రము స్తోత్యమయ్యా అను పల్లవి: నేత్రమువలె గత వత్సరము - మిత్రుడా బ్రోచితివి స్తోత్రము స్తోత్యమయ్యా 1. ఎన్నో గొప్ప కీడులు మాకు - పెన్నుగా కలిగినన్ అన్నియు మా చెంత చేరకుండునట్లు - మన్నాధిపా బ్రోచితి 2. పేరాశ పాపంబుల నీవు - ధారాళముగ మన్నించి ఈ వత్సరమందు పాపమున పడకుండ - నోవత్సా కాపాడుము 3. ఆనందారంభంతో నిండు - ఆశతో ప్రేమించి భూమియందు రక్షకుడుగ జన్మించిన స్వామి నిన్ను కొల్తుము 4. ఈ క్రొత్త యేడునందు మా అక్కర మేళ్ళన్నియు సతతము మాకు దయతోడ తీర్చుమో - వింత యేసు రక్షకా 5. గద్దియ జీవితము నీతో ముదముతో సల్పుటకు నిత్యము యేసును ప్రేమతో వెంబడింప - నన్ను కనికరింపుము 6. దేశకీడు తొల్గను - ఇంక - దోషములు వీడను హోసన్నా ఏకంబుగా పాడుటకు - దాసుల కరుణింపుము 7. హల్లెలూయ పాటను నీ ఏట నెక్కువగా పాడన్ దిక్కులవారికి సువార్త ప్రకటింప - గ్రక్కున వరములిమ్ము