♪♫
TG-5778
Telugu
స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా
Sthoothramu Yeesunaathaa Neeku Sadaa Sthoothramu Yeesunaathaa
0
views
పల్లవి
1. స్తోత్రము యేసునాథా నీకు సదా - స్తోత్రము యేసునాథా స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము - పిత్రపుత్రాత్మలకు 2. నేడు నీదు నామమందున - మేము చేరి స్తుతించునట్లు చేసిన కృపకై నీకే నిరతము - స్తోత్రము చేసెదము 3. నీదు రక్తధారచే కలిగిన - సజీవ నవమార్గము దాసులము తండ్రి సన్నిధి చేరను - నిత్యము స్వాతంత్ర్యము 4. ఇట్టి ప్రభావమైన పదవిని - పురుగులమగు మాకు ఇంత దయతోడ నిచ్చిన కృపమా - కెంతయు నాశ్చర్యము 5. దూతల సైన్యములు శృంగార - గీతముల నెప్పుడు రాజాధిరాజా నీ స్తుతులు పాడుచు - నార్భటించుచుందురు 6. నీవు తఫ్ఫ మాకు పరమందున - వేరెవరు గలరు? ఇద్దరయందు నీవు తప్ప మాకు ఆదరణ ఎవరు?