స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
Sthoothran Chellinthumu Sthuthi Sthoothran Chellinthumu
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం||
దివారాత్రములు కంటిపాపవలె కాచి (2) దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2) ||స్తోత్రం||
గాడాంధకారములో కన్నీటి లోయలలో (2) కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2) ||స్తోత్రం||
సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2) సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2) ||స్తోత్రం||
సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2) సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2) ||స్తోత్రం||
సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2) యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2) ||స్తోత్రం||
పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2) సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2) ||స్తోత్రం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.