♪♫
TG-5774
Telugu
స్తోత్రం స్తోత్రము దేవాది దేవా
Sthoothran Sthoothramu Deevaadi Deevaa
0
views
పల్లవి
స్తోత్రం స్తోత్రము దేవాది - దేవా పాత్రలనుగా - మార్చితివి దేవుని పాత్రలనుగ 1. శుద్ధీకరింప - బడిన పాత్రలు విజ్ఞాపన - చేయునవి సరిగ పుటము - వేయబడిన తగిన బలము - కలిగినవి 2. ఏర్పరచ - బడిన పాత్రలు విజ్ఞాపన - చేయునవి కదలక - స్థిరముగ నున్నవి ప్రభువును పొందినవి 3. ఘనపరచ - బడిన పాత్రలు స్తుతులు - చెల్లించునవి మరకలేని - కారణమున కొలతలో తగ్గనివి 4. ఉపయోగింప - బడెడి పాత్రలు సాక్ష్యము నిచ్చును - భువిలో లోక - శ్రమకెప్పుడు జడియనివి దాచిన ధనముకలవి 5. సత్యముతో - నిండిన పాత్రలు తెల్లని రంగు - కలవి స్వర్ణమువలె - కాంతి కలవి వెనుకంజ వేయనివి 6. కష్టములకు - తగిన పాత్రలు సకలము - సహించునవి నొక్కినను - వంకరకానివి జయధ్వని – చేయునవి