స్తోత్రించెదము దైవకుమారుని నూతన జీవముతో
Sthoothrinchedamu Daivakumaaruni Noothana Jeevamuthoo
స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో (2) నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము (2) యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు (2) సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ (2) భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి (2) బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్ (2) ||యేసు||
కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు (2) తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము (2) ||యేసు||
తల్లిదండ్రియు యెడబాసినను – విడువక కాయును (2) ఎల్లప్పుడు నేను భజియించెదను – వల్లభుడేసు ప్రభున్ (2) ||యేసు||
ఆత్మీయ పోరాటమునకు ప్రభువు – ఆత్మశక్తినిచ్చెన్ (2) స్తుతియు నీకే ఘనతయు నీకే – యుగయుగములలోన (2) ||యేసు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.