స్తోత్రింతుము నిను మాదు తండ్రీ - సత్యముతో నాత్మతో నెపుడు

sthoothrinthumu ninu maadu thandree - sathyamuthoo naathmathoo nepudu

🎵 TG-1253🌐 Telugu
పల్లవి

స్తోత్రింతుము నిను మాదు తండ్రీ - సత్యముతో నాత్మతో నెపుడు పరిశుద్దాలంకారములతో- దర్శించెదము - శరణం ...శరణం

1వ చరణం

శ్రేష్ట యీవుల నిచ్చినందున - శ్రేష్ట యీవుల యూట నీవే త్రిత్వమై యేకత్వమైన త్రి - యేక దేవా శరణం...శరణం ||స్తోత్రింతు||

2వ చరణం

పాపి మిత్రుడు,పాప నాశుడ - పరమ వాసుడ ప్రేమా పూర్ణడ వ్యోమ పీఠుడ, స్వర్గపూజ్యుడ- పరిశుద్దాంగుడ,శరణం..శరణం ||స్తోత్రింతు||

3వ చరణం

దవళ వర్ణుడ, రత్నవర్ణుడ- సత్యరూపి యనబడువాడ నను రక్షించిన రక్షకుండ- నాధా నీకే శరణం ....శరణం ||స్తోత్రింతు||

4వ చరణం

సంఘమునకు శిరస్సు నీవే - రాజనీకే నమస్కారములు ముఖ్యముగను మూల రాయి - కోట్లకొలది శరణం..శరణం ||స్తోత్రింతు||

5వ చరణం

నీదు సేవకుల పునాదిది - జ్ణానమునకు మించిన తెలివి అందముగను కూడుకొనుచు - వేడెదము శరణం ..శరణం ||స్తోత్రింతు||

6వ చరణం

రాజనీకే స్తుతి స్తోత్రములు - గీతముల మంగళ ధ్వనులు శుభము ,శుభము,శుభము నిత్యము - హల్లెలూయ ఆమెన్‌, ఆమెన్‌ ||స్తోత్రింతు||

Report Error