తోత్రింతుము నిను
Sthothrinthumu Ninu
స్తోత్రింతుము నిను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు (2) పరిశుధ్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం (2) ||స్తోత్రింతుము||
శ్రేష్ఠ యీవుల యూట నీవే శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున (2) త్రిత్వమై ఏకత్వమైన త్రి- లోకనాథ శరణం శరణం (2) ||స్తోత్రింతుము||
దవలవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపి యనబడువాడా (2) నను రక్షించిన రక్షకుండవు నాథ నీవే శరణం శరణం (2) ||స్తోత్రింతుము||
సంఘమునకు శిరస్సు నీవే రాజా నీకే నమస్కారములు (2) ముఖ్యమైన మూలరాయి కోట్లకొలది శరణం శరణం (2) ||స్తోత్రింతుము||
నీదు సేవకుల పునాది జ్ఞానమునకు మించిన తెలివి (2) అందముగనూ కూడుకొనుచు వేడుకొందుము శరణం శరణం (2) ||స్తోత్రింతుము||
రాజ నీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళ ధ్వనులు (2) శుభము శుభము శుభము నిత్యం హల్లెలూయా ఆమెన్ ఆమెన్ (2) ||స్తోత్రింతుము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.