స్తుతి గానమే పాడనా జయగీతమే
sthuthi gaanamee paadanaa jayageethamee
🎵 TG-2310🌐 Telugu
పల్లవి
స్తుతి గానమే పాడనా జయగీతమే పాడనా (2) నా ఆధారమైయున్న యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి||
1వ చరణం
నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి నీ ధర్మాసనము – నా హృదయములో స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి నీ శ్రేష్టమైన – పరిచర్యలకై కృపావరములతో నను – అలంకరించితివే నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది నీ సింహాసనము – నను చేర్చుటకై నాతో నీవుంటివే – నా గురి నీవైతివే