TG-5761
Telugu

స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ

Sthuthi Keerthaneeyudaa Ghanamaina Nee Preema

0
views
పల్లవి

స్తుతి కీర్తనీయుడా - ఘనమైన నీ ప్రేమ నా హృదయవీణపై శృతి చేసి పాడనా (2) నా యేసురాజా - అనురాగ బంధమా నను విడువలేని ఆత్మానుబంధమా (2) 1. నా ప్రియ నేస్తమా - నా ప్రాణ బంధమా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా (2) నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును ఇలలోన నీకై సాక్షిగా జీవింతును (2) ||నా యేసురాజా||

1వ చరణం

2. నా నీతిసూర్యుడా - తేజో ప్రకాశమా నీ వెలుగు జాడలలో నిను వెంబడించగా (2) నీ జీవ వాక్యం నింపెనే నాలో ధైర్యము ప్రాణాత్మదేహం సర్వదా నీకే అంకితం (2) ||నా యేసురాజా||

2వ చరణం

3. మహిమ సింహాసనం - నే చేరాలనే నే కన్న కలలన్నీ నిజమైన వేళలో (2) నా జయము నీవై నిలిచినా శ్రేష్ఠ తరుణాన నీలోనే లీనమై పోదునే నే నిరతము (2) ||నా యేసురాజా||