♪♫
TG-2684
Telugu
స్తుతి నీకే యేసు రాజా
sthuthi neekee yeesu raajaa
85
views
పల్లవి
స్తుతి నీకే యేసు రాజా మహిమ నీకే యేసు రాజా స్తోత్రం నీకే యేసు రాజా ఘనత నీకే యేసు రాజా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా (2) (యేసు) రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు త్వరలోనే రానున్నాడు నిత్యజీవమును మన అందరికిచ్చి పరలోకం తీసుకెళ్తాడు (2) ||స్తుతి||
1వ చరణం
మధ్యాకాశములో ప్రభువును కలిసెదము పరిశుద్ధుల విందులో పాలునొందెదము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు తేజోవాసులతో స్తుతియింతుము ||హోసన్నా||
2వ చరణం
సంతోష గానాలతో ఉత్సాహించి పాడెదము క్రొత్త కీర్తనతో రారాజును ఘనపరచెదము శ్రమలైనా శోధనలెదురైనా ఆర్భాటముతో సన్నుతింతుము ||హోసన్నా||
3వ చరణం
||స్తుతి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.