TG-1246
Telugu

స్తుతి పాడనా నేను ననుకాచె యేసయ్యకు

sthuthi paadanaa neenu nanukaache yeesayyaku

191
views
పల్లవి

స్తుతి పాడనా నేను ననుకాచె యేసయ్యకు నాజీవన దాతకు నను నడిపే ప్రభువుకు (2)

1వ చరణం

పాపములో పడియున్నవేళా - వదలక వడి చేర్చిన నాదేవా నిదివ్య కాంతితో - నను నడిపే ప్రభువుకు (2) ||స్తుతి||

2వ చరణం

సోలిపోయి తూలుచున్నవేళా - వదలక నను నడిపిన నాదేవా నా హృదయ ధ్యానమే నీకే అర్పింతును (2) ||స్తుతి||

3వ చరణం

భువినేలు రారాజు నీవనీ - పరలోక మహిమను ప్రకటించిన నీ రెక్కల చాటునా నను దాచే ప్రభుడవు (2) ||స్తుతి||