స్తుతి పాత్రుడా -స్తోత్రార్హుడా - స్తుతులందుకో - పూజార్హుడా

sthuthi paathrudaa -sthoothraarhudaa - sthuthulandukoo - puujaarhudaa

🎵 TG-1244🌐 Telugu
పల్లవి

స్తుతి పాత్రుడా -స్తోత్రార్హుడా - స్తుతులందుకో - పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప - నాకెవ్వరున్నారు నా ప్రభు

1వ చరణం

నా శత్రువులు - నను తరుముచుండగా నా యాత్మ నాలో కృంగెనే ప్రభు నా మనస్సు నీవైపు - త్రిప్పిన వెంటనే శత్రువుల చేతినుండి- విడిపించినావు కాపాడినావు ||స్తుతి పాత్రుడా||

2వ చరణం

నా ప్రాణ స్నేహితులు- నన్ను చూచి దూరాన నిలిచేరు - నా ప్రభూ నీ వాక్య ధ్యానమే - నా త్రోవకు వెలుగై నను నిల్పెను నీ సన్నిదిలో - నీ సంఘములో ||స్తుతి పాత్రుడా||

Report Error