♪♫
TG-4305
Telugu
స్తుతి ప్రశంస పాడుచు
Sthuthi Prashamsa Paaduchu
22
views
పల్లవి
స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము (2) మహా రక్షణ నిచ్చియు మనశ్శాంతి నిచ్చెను (2) పాపలోక బంధమందు దాసత్వమందుండ (2) నీ రక్తశక్తిచే ప్రభు విమోచించితివి (2) ||స్తుతి ప్రశంస||
1వ చరణం
పాప భారముచే నేను దుఃఖము పొందితి (2) నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు (2) ||స్తుతి ప్రశంస||
2వ చరణం
హృదయాంధకారముచే నేను దారి తొలగితి (2) ప్రభువే జ్యోతి యాయెను సత్యమార్గము చూపె (2) ||స్తుతి ప్రశంస||
3వ చరణం
పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివి (2) దరిద్రుడనైన నన్ను రాజుగా జేసితివి (2) ||స్తుతి ప్రశంస||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.