♪♫
TG-4307
Telugu
తుతి సింహాసనాసీనుడా
Sthuthi Simhaasanaaseenudaa
0
views
పల్లవి
స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా (2) నీవేగా నా దైవము యుగయుగాలు నే పాడెదన్ (2) ||స్తుతి||
1వ చరణం
నా వేదనలో నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి (2) నీ కోసమే – నీ కృప కోసమే (2) నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా (2) ||స్తుతి||
2వ చరణం
నీ సేవలోనే తరియించాలని నీ దరికి ఆత్మలను నడిపించాలని (2) నీ కోసమే – నీ కృప కోసమే (2) నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా (2) ||స్తుతి||
3వ చరణం
నా ఆశయముతో నా కోరికతో నా గురి నీవని పరుగిడుచుంటిని (2) నీ కోసమే – నీ కృప కోసమే (2) నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా (2) ||స్తుతి||