♪♫
TG-1243
Telugu
స్తుతి సింహాసనాసీనుడా - యేసు రాజా దివ్యతేజ
sthuthi sinhaasanaaseenudaa - yeesu raajaa divyatheeja
205
views
పల్లవి
స్తుతి సింహాసనాసీనుడా - యేసు రాజా దివ్యతేజ
1వ చరణం
అద్వితీయుడవు - పరిశుద్ధుడవు - అతి సుందరుడవు నీవె ప్రభు నీతి న్యాయములు నీ - సింహాసనాధారం కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు ||స్తుతి సింహాసనాసీనుడా||
2వ చరణం
బలియు అర్పణ కోరవు నీవు- బలియైతివి నా దోషముకై నా హృదయమే నీ - ప్రియమగు ఆలయం స్తుతి యాగమునే చేసెద నిరతం ||స్తుతి సింహాసనాసీనుడా||
3వ చరణం
బూరధ్వనులే నింగిలో మ్రోగగ - రాజాధి రాజ నీవే వచ్చువేళ సంసిద్ధతతో - వెలిగే సిద్దితో పెండ్లికుమారుడా నిన్నెదుర్కొందును ||స్తుతి సింహాసనాసీనుడా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.