♪♫
TG-4309
Telugu
స్తుతికి పాత్రుడా
Sthuthiki Paathrudaa
0
views
పల్లవి
స్తుతికి పాత్రుడా సత్య శీలుడా (2) నిరతము నీలో సాగె కృపను ఇమ్మయ్యా నిరతము నిన్ను సేవించే శక్తిని ఇమ్మయ్యా (2) ||స్తుతికి పాత్రుడా||
1వ చరణం
ప్రేమధ్వజమును సిలువలో నిలిపి అనంతప్రేమను చూపితివి పాపమునుండి విడిపించి రక్షణవస్త్రం నొసగితివి (2) నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం వర్ణించలేనిది వివరించలేనిది (2) ||స్తుతికి పాత్రుడా||
2వ చరణం
యోగ్యతలేని మాకై నీ పౌరసత్వాన్ని ఇచ్చితివి పరిశుద్దాత్మను మాకొసగి బలవంతులుగా చేసితివి (2) ఎలాగు మరువను ఎలాగు విడువను నీ స్నేహము నీ బంధము (2) ||స్తుతికి పాత్రుడా||