♪♫
TG-4310
Telugu
స్తుతించెదను నిన్ను నేన
Sthuthinchedanu Ninnu Nenu
0
views
పల్లవి
స్తుతించెదను – నిన్ను నేను మనసారా భజించెదను – నేను నిన్ను దినదినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము నీ కర్పించెదను (2) ||స్తుతించెదను||
1వ చరణం
పూజార్హుడవు పవిత్రుడవు పాపిని క్షమియించె మిత్రుడవు (2) పరము చేర్చి ఫలములిచ్చె పావనుడగు మా ప్రభువు నీవే (2) ||స్తుతించెదను||
2వ చరణం
కృపా కనికరములు గల దేవా కరుణ జూపి కనికరించు (2) కంటి రెప్ప వలె కాపాడు కడవరకు మమ్ము కావుమయ్య (2) ||స్తుతించెదను||
3వ చరణం
సర్వశక్తి గల మా ప్రభువా సజీవ సాక్షిగా చేయుమయా (2) స్థిరపరచి మమ్ము బలపరుచు సదా నీకే స్తోత్రాలర్పింతును (2) ||స్తుతించెదను||