TG-4311
Telugu

స్తుతించెదను స్తుతించెదను

Sthuthinchedanu Sthuthinchedanu

0
views
పల్లవి

స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము ||స్తుతించెదను||

1వ చరణం

ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక (2) ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని (2) ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను (2) ||స్తుతించెదను||

2వ చరణం

నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి (2) నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప (2) నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి (2) ||స్తుతించెదను||

3వ చరణం

పాపము క్షమించి రోగము బాపి – భయమును దీర్చి (2) పవిత్రదాయక పావన మూర్తి – పరిశుద్ధ మిచ్చిన (2) పరమ పాదం శరణ్యం నాకు – పరమ రాజా పుణ్య దేవా (2) ||స్తుతించెదను||

4వ చరణం

తల్లి గర్భమునకు ముందేర్పరచి – దేహము నమర్చియును (2) దక్షిణ బాహుతో పట్టుకొనిన – దయా సంపూర్ణుడా (2) దిక్కు జయము ఆదరణయు – దయతో అనుగ్రహించితివి (2) ||స్తుతించెదను||

5వ చరణం

సిలువనెత్తి శ్రమలు సహించి – సేవకు పిలచిన (2) స్నేహ దర్శక వీర యోధ – సంశయ హారకా (2) శ్రమలు నింద ఆకలియైన – నీ స్నేహమునుండి ఎడబాపునా (2) ||స్తుతించెదను||