స్తుతించెదను స్తుతించెదను నా యేసు

sthuthinchedanu sthuthinchedanu naa yeesu

🎵 TG-2156🌐 Telugu
పల్లవి

స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము ||స్తుతించెదను||

1వ చరణం

ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక (2) ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను (2)         ||స్తుతించెదను||

2వ చరణం

నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి పాపము క్షమించి రోగము బాపి – భయమును దీర్చి పవిత్రదాయక పావన మూర్తి – పరిశుద్ధ మిచ్చిన పరమ పాదం శరణ్యం నాకు – పరమ రాజా పుణ్య దేవా తల్లి గర్భమునకు ముందేర్పరచి – దేహము నమర్చియును దక్షిణ బాహుతో పట్టుకొనిన – దయా సంపూర్ణుడా దిక్కు జయము ఆదరణయు – దయతో అనుగ్రహించితివి సిలువనెత్తి శ్రమలు సహించి – సేవకు పిలచిన స్నేహ దర్శక వీర యోధ – సంశయ హారకా శ్రమలు నింద ఆకలియైన – నీ స్నేహమునుండి ఎడబాపునా

Report Error