♪♫
TG-4312
Telugu
స్తుతించి పాడెదం
Sthuthinchi Paadedam
0
views
పల్లవి
స్తుతించి పాడెదం – స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం – ఉదయ సాయంత్రముల్ స్తుతుల సింహాసనం మీదాసీనుడా మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము (2) ||స్తుతించి||
1వ చరణం
గతకాలమంతా నీవు – మము కాచి కాపాడావు వ్యధలన్ని తీసావు (2) గతి లేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి (2) శత సంఖ్యగా మమ్ము దీవించావు ||స్తుతించి||
2వ చరణం
కరుణా కటాక్షములను కిరీటములగాను ఉంచావు మా తలపై (2) పక్షి రాజు యవ్వనమువలె మా యవ్వనమునంతా (2) ఉత్తేజపరిచి తృప్తిని ఇచ్చావు ||స్తుతించి||