TG-4313
Telugu

తుతించుడి యెహోవా దేవుని

Sthuthinchudi Yehovaa Devuni

0
views
పల్లవి

స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి||

1వ చరణం

కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా (2) ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి||

2వ చరణం

రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా (2) బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి||