స్తుతియించెద దేవా ఆరాధన నీకె కొనియాడేదా నిన్నే పరిశుద్ధుడని
Sthuthiyincheda Deevaa Aaraadhana Neeke Koniyaadeedaa Ninnee Parishuddhudani
స్తుతియించెద దేవా ఆరాధన నీకె కొనియాడేదా నిన్నే పరిశుద్ధుడని కీర్తించెద దేవా మహిమ ఘనత నీకె ప్రకటించేద నిన్నే పరిపూర్ణుడని దేవదూతల ఆరాధన కంటే నా స్తుతులపై ఆశీనుడవయ్యా కోట్ల దూతల సాహిత్యము విడచి నా ముందుగా ఉదయించిన ప్రభువా కోల్పోయిన జీవం తిరిగి పొందుటకే నాకిచ్చినవే ఈ జన్మా నీ దివ్య చిత్తం నాలో నెరవేర్చి నా వరుడై కొనుపోవుదువే ఏరితిగా చూసిన యోగ్యత లేదే పుట్టుకతోనే పాపినైతినే నా బ్రతుకంత బహుహీనమైనదే వ్యసనాలలో పడి చెడిపోతినే మార నాబ్రతుకు మధురము గా చేసి మహిమలో నీతోనే నేనుండుటకే మారని నా యదకు మాదిరి చూపించి నా మదిలో నీవే నివసించుటకే పాపి కోసమే వచ్చానని దేవా పరిశుద్ధునిగా చేసితివా నన్ను నీ రక్తము తో కడిగితివా ప్రభువా నా రక్షణకై బలిగా మారితివా చీకటి లోకములో ప్రకాశించిన దీపం నివలనే నాకి భాగ్యం ఈ చితికి హృదయములో చిగురించిన రూపం నీవే నాకు చాలయా ఎటు చూసినా తోడు లేరని ఆపదలోనే అలిసిపోతిని ఆధారము నీవని ఆశించితిని నా దిక్కు నివేనని మొరపెట్టితిని మరణాపాయమున జీవముగానున్న నీ కృప నాపైన విరజిమ్మితివే మరణాపాయమున మలినము కానున్న మహిమాత్మతో నన్ను దర్శించితివే నత్తి పెదవుల ప్రార్ధనలకించే జాలివంతుడా నా ఏసు దేవా అన్నివేళలా తోడు ఉండి నడిపే ఆశ్రయపురము నీవే యెహోవా నీ వంటి దైవం ఇలలో ఎవరు లెనేలేరయ్య యేసయ్య నీ ప్రేమ కన్నా ఇహలో ఏ ప్రేమ స్థిరమే కాదు యేసయ్య కష్టమొచ్చిన కలత చెందక నష్టమొచ్చిన విడచి వేళ్ళక శోధనొచ్చిన సోలిపోవక నిస్సహాయునై నిలిచిపోనిక వేదన సమయమున వేడుకగా ఉన్న వాక్యము నా హృదిన వెలిగించితివే వెలుపల నేనున్నా వెదకిన నీ ప్రేమ మరువక నీ కొరకే పయనించేదనే కష్టాల కొలిమిలోనే కమనీయ గీతం నా నోటా నుంచి నిన్నే ప్రణుతింతునయ్య కన్నీటి బాటలోనే ఆనంద వర్షం కురిపించి నన్ను నడిపించి నావు కొనఊపిరినైన నిన్నే స్మరియించి నీ కౌగిలి చేరేద యేసయ్య నే బ్రతికిన క్షణమైనా నీమహిమార్థముకై జీవించి వస్తానయా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.