TG-4314
Telugu

స్తుతియించి కీర్తించి

Sthuthiyinchi Keerthinchi

22
views
పల్లవి

స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2) నీవే నా ఆరాధన యేసయ్యా నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవే నా ఆత్మలో ఆనందమయ్యా నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి||

1వ చరణం

గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా అగాధ జలములలోన మార్గము చూపించినావా (2) అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా (2) నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి||

2వ చరణం

అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2) ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు (2) నీ ప్రజలను రక్షించినావు ||స్తుతియించి||

3వ చరణం

పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2) అనుదినము మాతో నీవుండి మమ్ము నడిపించు దేవా (2) మము పరముకు నడిపించు దేవా ||స్తుతియించి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.