TG-584
Telugu

స్తుతియింతుమో ప్రభువా శుభమౌ నీ

sthuthiyinthumoo prabhuvaa shubhamau nee

206
views
పల్లవి

స్తుతియింతుమో ప్రభువా శుభమౌ నీ దినమున పరిశుద్ధమగు నీ నామము గతకాలమున నీవు పతితుల మగు మాకు అతిదయతోఁ జేసిన యన్ని మేలులు దలఁచి ||స్తుతియింతుమో ప్రభువా||

1వ చరణం

ఎన్న శక్యముగాక యున్న మహిమతో వెలుఁగు చున్న నీ పద సన్నిధిన్ సన్నుతాత్మా మేము ఆత్మతో సత్యముతో నిన్నారాధించుతము యీ చెన్నౌ నీ గృహమందు ||స్తుతియింతుమో ప్రభువా||

2వ చరణం

ఇచట నీ వాక్యము నుచితరీతిని చాట నీ సేవకుల నందఱిన్ శుచియౌ నీ యాత్మతో పరిపూర్ణముగ నింపి ప్రచురింపను శక్తి నధిక ముగ నిమ్ము ||స్తుతియింతుమో ప్రభువా||

3వ చరణం

భక్తితో నీ జనులు యుక్తముగ నిను వేఁడ శక్తి వారి కిమ్మెపుడు ముక్తి కోసము నిన్నా సక్తితో ప్రార్థింప రక్తితో విని వారి కానందమును గూర్చు ||స్తుతియింతుమో ప్రభువా||

4వ చరణం

జనక కుమారాత్మ లను దేవ నీ కెప్పు డెనలేని స్తుతి కల్గును ఆనయము మేమిలలో కొనియాడుటకు నిన్ను ఘనుఁడా దీవెన మాపై కుమ్మరింపుము వేగ ||స్తుతియింతుమో ప్రభువా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.