♪♫
TG-4315
Telugu
తుతియింతుము
Sthuthiyinthumu
0
views
పల్లవి
స్తుతియింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రిని (2) ||స్తుతియింతుము||
1వ చరణం
నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా (2) వర్ణింప మా తరమా మహిమ కలిగిన నీ నామమును ||స్తుతియింతుము||
2వ చరణం
మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి (2) మాదు రక్షణ కొరకై రక్తమును కార్చిన రక్షకుడా ||స్తుతియింతుము||
3వ చరణం
పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలనుగా (2) పరలోక తనయులుగా పరమ కృపతో మార్చిన దేవా ||స్తుతియింతుము||