స్తుతియు మహిమ ఘనత
Sthuthiyu Mahima Ghantha
స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా (2) ||స్తుతియు||
మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభ దినము (2) మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2) కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2) ||స్తుతియు||
నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘనకార్యములు చేయుదువు (2) నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2) నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2) ||స్తుతియు||
నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి (2) జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా (2) నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను (2) ||స్తుతియు||
భరియించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్ని మా కొరకు (2) మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ (2) పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము (2) ||స్తుతియు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.