TG-572
Telugu

స్తుతియు మహిమయు నీకె క్షితికిన్

sthuthiyu mahimayu neeke kssithikin

205
views
పల్లవి

స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి వితతికిన్ కర్తవై వెలయు మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు హితుఁడా మా ప్రేమ నీ కెట్లు చూపుదుము ||స్తుతియు మహిమయు||

1వ చరణం

పసిఁడి వర్ణపు టెండ భాగ్య ధారల వాన విసరు మంచి గాలి విరియు పుష్పములు రస మొల్కు పండ్లు నీ రమ్య ప్రేమన్ జాటున్ బ్రసరించు కో తలో పల నుందు వీవు ||స్తుతియు మహిమయు||

2వ చరణం

నెమ్మదిగల యిండ్లు నిజసౌఖ్య కాలములు ఇమ్మహి ఫలియించు నైశ్వర్యాధికముల్ ఇమ్ముగ గలిగిన హృదయులమై వంద నమ్ములు ఋణపడి యు న్నాము నీకు ||స్తుతియు మహిమయు||

3వ చరణం

దురితంబు లొనరించి దౌర్భాగ్య స్థితి నున్న ధరణికి నీ పుత్రున్ ధర్మంబు జేసి నరుల కీ ధర్మమున కొరఁత దీర్చెడు సర్వ వరము లమర్చిన పరమోపకారి ||స్తుతియు మహిమయు||

4వ చరణం

జీవంబు ప్రేమను జేవఁ గల్గించెడు పావనాత్మను మాకై పంపితివి దీవెన లేడు రె ట్లావరింపను మమ్ము నీ విమలాత్మ వా నిని గుమ్మ రించు ||స్తుతియు మహిమయు||

5వ చరణం

నరులకు విమోచ నము గల్గె పాపంబుల్ పరిహార మాయెఁ గృ పాసాధనముల్ దొరికె మోక్షాంశంబు స్ధిరమాయె మేము నీ కొరకేమి తేగలము పరిపూర్ణ జనకా ||స్తుతియు మహిమయు||

6వ చరణం

మాకై వాడుకొనెడి రూకల్ వ్యర్థం బగును నీకై యప్పుగ నిచ్చు నిఖిల వస్తువులు శ్రీకరంబగు నిత్య శ్రేష్ఠ ధననిధియై పై లోకంబు నందుండు లోపంబు లేక ||స్తుతియు మహిమయు||

7వ చరణం

జీవంబు వస్తువులు శ్రేయస్సు దాన స్వ భావంబు శక్తియు భాగ్యంబులు నీవలననే లభ్యమై వెలయుచున్నవి నీ వాసమే మాకు నిత్యానందంబు ||స్తుతియు మహిమయు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.