TG-5769
Telugu

స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా

Sthuthulu Neekarpinthumu Sathathamu Maa Prabhuvaa

0
views
పల్లవి

స్తుతులు నీకర్పింతుము - సతతము మా ప్రభువా సన్నుతించెదము 1.  గడచినట్టి కాలము - కరుణతో నన్ గాచితివి వెల లేనట్టి నే కృప - చూపినట్టి మా ప్రభు 2.  నాదు దినము లన్నిటన్ - నీదు క్షేమ మేలును నీదుజాడలన్నియున్ - సారంబు నిచ్చును 3.  నీదు మందిరంబులో - మేలుచెత మమ్మును తృప్తిపరచిన ప్రభు - స్తుతులు నీకే చెల్లును 4.  నీదు నామ ఘనతను - నీదు ప్రేమ పనులను నాథుడా నే పాడెద - నాదు ప్రియ ప్రభువా 5.  సత్య రూపి నీవెగా - సకల సృష్టి కర్తవు సతతము మమ్మేలుము - హల్లెలూయ పాడెదం